స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను చేసిన పాపాలు, ఘోరాలే ఇవాళ చంద్రబాబును వెంటాడుతున్నాయి.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశాడు చంద్రబాబు.. నిరసనగా కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం పళ్ళాలు కొడుతూ ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: ICC World Cup 2023: ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు!
నిన్న అంతా నవ్వుకుంటూ విజిల్స్, డప్పు మోత మోగించారిన పేర్నినాని అన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఆనందంగా డప్పు కొట్టారు.. టీడీపీ నేతల్లో ఆనందం తాండవిస్తోంది.. ఎవరిలోనూ కొంచెం కూడా బాధ కనిపించ లేదు.. అక్రమ కేసులు అయితే కోర్టుల్లో ఎందుకు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు రావటం లేదు?.. టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. లంచాలు తినేసి కంచాలు మోగిస్తున్నారు అని పేర్నినాని అన్నారు. టీడీపీ పార్టీకి కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పే పార్టీ కేడర్ ఎక్కడికి పోయింది అని పేర్నినాని ప్రశ్నించారు. చంద్రబాబు జనం సొమ్ము నొక్కేశారని అందరు అనుకుంటున్నారు..
Read Also: Viral Fever: వైరల్ ఫివర్స్ తో వణుకుతున్న ములుగు ఏజెన్సీ.. ఏ పల్లె చూసిన జ్వర పీడుతులే..
టీడీపీ తమకు కోటి మంది సభ్యులు ఉన్నారు అని చెప్పుకుంది మరి.. నిన్న ఎంత మంది కంచాలు కొట్టారు? అని పేర్నినాని అడిగారు. దొంగ లెక్కలు చెప్పటం టీడీపీ మానుకోవాలి.. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అంత హడావుడి ఉందా?.. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్డు ఎక్కితే జైల్లో వేస్తానని అప్పుడు చంద్రబాబు హెచ్చరించాడు అని ఆయన అన్నారు. ఇప్పుడు తాను ఆ అవినీతి చేసి దొరికితే ప్రజలు అందరూ రోడ్డు మీదకు రావాలట.. కాంగ్రెస్ తో చేతులు కలిపి టీడీపీ ఎన్నో అక్రమ కేసులు పెట్టింది.. రాజకీయాల్లో రాకుండా తొక్కేయాలని చూసింది అని ఆయన అన్నారు.
Read Also: Market Outlook: కుప్పకూలిన పెద్ద కంపెనీలు.. ఈ వారం కూడా మార్కెట్ పరిస్థితి ఏంటి ?
నాటి తప్పుడు కేసుల్లో అధికారులు, మంత్రులు తప్పు చేయలేదని బయటకు వస్తోంది అని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. వాళ్ళే తప్పు చేయకపోతే జగన్ తప్పు చేయటానికి అవకాశం ఎక్కడ? ఉంది అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ చంద్రబాబు ప్యాలెస్ ఎవరు కట్టారో తెలియదా?.. కరకట్ట కొంప ఎవరిది? ప్రజలకు తెలియదా?.. లింగమనేని రమేష్ కరకట్ట ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చాడని చంద్రబాబు అమ్మవారి సాక్షిగా చెప్పాడు.. అధికారం పోగానే ఆ కొంపను ప్రభుత్వానికి ఎందుకు తిరిగి అప్పగించ లేదు? అని మండిపడ్డారు. ఇంత వరకు ఆ కొంపలోనే ఎందుకు ఉంటున్నారు?.. కన్న తండ్రి జైల్లో ఉంటే నారా లోకేష్ ఢిల్లీలో ఎందుకు కులుకుతున్నాడు?.. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తానని లోకేష్ కార్యకర్తలకు చెప్పేవాడు.. తమపై కేసులు రాగానే ఎందుకు గగ్గోలు పెడుతున్నాడు?.. మీకు పెద్ద పదవులు వద్దా? అని పేర్నినాని అడిగారు.