ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో (Indian Coast Guard) శాశ్వత కమిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మహిళా కోస్ట్‌గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసే అంశంపై కేంద్రానికి అల్టిమేటం ఇస్తూ.. ‘మహిళలను వదిలిపెట్టలేం అని, మీరు చేయకుంటే మేం చేస్తాం’ అని సుప్రీం కోర్టు ఈరోజు పేర్కొంది.
కోస్ట్ గార్డ్ కు చెందిన మహిళా అధికారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్‌కు అర్హులైన మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు హెచ్చరిక తర్వాత ఆర్మీ మహిళలకు శాశ్వత కమిషన్‌ను నియమించేదందుకు అంగీకరించింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమీషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్క రించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తామని నవంబర్ 12, శుక్రవారం ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఈ విషయంపై గతంలో ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడతారని సుప్రీంకోర్టు…