Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్ గా పనిచేస్తున్న ఉద్యోగికి నాగరాజుకు అవమానం జరిగిందని స్వాములు తెలిపారు.