AP Disaster Management Authority: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు..
- ఈ రోజు.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Disaster Management Authority: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో.. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.. అయితే, ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఇక, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..
Read ALso: Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇక, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఈ సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది.. ఇక, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండరాదు అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?