ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెట్టాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా.. తోడుగా నిలిచాడు. తనకు చేతనైనంత మట్టుకు కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకుని తోడుగా నిలిచి ప్రశంసలు పొందుకున్నాడు.
ఇది కూడా చదవండి: RK Roja: పారిశుద్ధ్య కార్మికులతో రోజా షాకింగ్ ప్రవర్తన..వీడియో వైరల్
నటుడిగా తన వెనుక నాలుగు రాళ్లు వెనకేసుకోకుండా.. సంపాదించిన డబ్బులో తన వంతుగా సాయం చేసి పేదల గుండెల్లో సోనూ సూద్ నిజమైన హీరోగా నిలిచాడు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సాయం కోసం తన ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్లను చూసి సోనూ సూద్ చలించిపోయాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. తడుస్తూనే ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు.. ఎవర్నీ కాదనకుండా అందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగి వాళ్లను సంతోష పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక నెటిజన్లు అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూ సూద్ నిజమైన హీరో అంటూ కీర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Terrorist Incidents: రెండు నెలల్లో 9 ఉగ్రవాద ఘటనలు.. ఈ ఏడాది 22 మంది మృతి