Pension Money: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మతిస్థిమితం లేని ఓ మహిళ యొక్క వృద్ధాప్య పెన్షన్ డబ్బులను కుటుంబ సభ్యులు కాజేస్తున్నారు. మానవత్వం లేకుండా మతిస్థిమితం లేని మహిళను కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన మద్ధింశెట్టి బంగారమ్మకు అమలాపురం బస్ స్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.
Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు