శేషశైలవాసుని మురిపించిన స్వరకర్త … పార్వతీవల్లభుని పరవశింప చేసిన బాణీలు… చంద్రకళాధరి ఈశ్వరినే ప్రసన్నం చేసుకున్న సంగీతనిధి పెండ్యాల నాగేశ్వరరావు. చిగురాకులలో చిలకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులనే పులకింపచేసిన స్వరకేళి ఆయన సొంతం} ఆయన పంచిన మధురం మరపురానిది- మరువలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామరభేదం లేకుండా అందరినీ అలరించింది. ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. పెండ్యాల నాగేశ్వరరావు…