‘ఆంధ్రా ప్యారిస్’గా పేరొందిన తెనాలి పట్టణంలో యన్టీఆర్ తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరిట ఓ థియేటర్ ను నిర్మించారు. అదే థియేటర్ ప్రస్తుతం పెమ్మసాని పేరుతో నడుస్తోంది. ఇదే థియేటర్ లో యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ యేడాది మే 28వ తేదీ నుండి వచ్చే యేడాది మే 28వ తేదీ దాకా అంటే సంవత్సరం పాటు యన్టీఆర్ నటించిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రోత్సవం సందర్భంగా పలువురు సినీ, నాటకరంగప్రముఖులను, యన్టీఆర్ తో…