దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిల్చున్న వారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. క్షణాల్లో దూసుకురావడంతో హడలెత్తిపోయారు. మనవడితో నడుచుకుంటూ వెళ్తు్న్న వ్యక్తిని ఢీకొట్టింది.
ముంబైలోని కుర్లాలో ఎస్‌జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది.