దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిల్చున్న వారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. క్షణాల్లో దూసుకురావడంతో హడలెత్తిపోయారు. మనవడితో నడుచుకుంటూ వెళ్తు్న్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Children’s Health: చలికాలంలో పిల్లల ఆరోగ్యం పదిలం.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం 10:11 గంటలకు పట్టపగలు అతివేగంగా దూసుకొచ్చిన కారు పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. 56 ఏళ్ల వ్యక్తి తన ఏడేళ్ల మనవడితో నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టింది. మనవడు కారు వెనుక బానెట్ కింద చిక్కుకుపోయాడు. చిన్నారిని కాపాడేందుకు చుట్టుపక్కలవారు పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు 17 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని.. యువ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: BJP: భారీ షాక్.. మాజీ క్యాబినెట్ మంత్రితో సహా 12 మంది నేతల సస్పెండ్.. ఎందుకంటే?
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మైనర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కఠిన మైన శిక్షలు విధించాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
देखिए दिल्ली आदर्श नगर में हुआ खौफनाक एक्सिडेंट
बताया जा रहा है कथित तौर पर एक नाबालिग द्वारा चलाई जा रही कार ने एक बच्चे सहित चार लोगों को कुचल दिया,उस बच्चे की हालत गंभीर है पुलिस ने मामला दर्ज किया है pic.twitter.com/qdlI8P8nXB
— Lavely Bakshi (@lavelybakshi) December 16, 2024