మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకొని హుటాహుటిన…
ఎన్నికలు ఏం లేకపోయినా కేవలం ప్రజలు ఎలా వున్నారు, వారి సమస్యలను తెలుసుకోవడానికే పల్లెబాట చేపట్టాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులందరికీ పధకాలు అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకుంటున్నాం. కేవలం ఇల్లు, పెన్షన్ లాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు తీసుకొస్తున్నారు. అర్హులకు 100 శాతం పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నాం అన్నారు. ఎలాంటి అవసరం వచ్చినా సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉంది. గతంలోలా కాకుండా…
పేదలకు మేలు చేసే ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ఓటీఎస్ పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒక సంస్కరణ లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఓటీఎస్ ను తెచ్చారు. ఓటీఎస్ చేసుకోవడం ద్వారా పట్టా ఇచ్చి శాశ్వత హక్కు కల్పిస్తున్నాం. పట్టా ద్వారా తాకట్టు పెట్టుకునేందుకు, రుణం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక రూపాయి కూడా లేకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ప్రభుత్వం ఓటీఎస్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…