ఎన్నికలు ఏం లేకపోయినా కేవలం ప్రజలు ఎలా వున్నారు, వారి సమస్యలను తెలుసుకోవడానికే పల్లెబాట చేపట్టాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులందరికీ పధకాలు అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకుంటున్నాం. కేవలం ఇల్లు, పెన్షన్ లాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు తీసుకొస్తున్నారు.
అర్హులకు 100 శాతం పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నాం అన్నారు. ఎలాంటి అవసరం వచ్చినా సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉంది. గతంలోలా కాకుండా ఇంటి దగ్గరికి వచ్చి ఏమి కావాలి అని అడిగే పరిస్థితి వచ్చింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఈ వ్యవస్థని తీసుకొచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. ప్రతి ఇంటికి నీరు అందేలా ప్రతి గ్రామానికి ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి. ఇంత చేస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రజలు సమర్ధించాలన్నారు.