రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని, 9 వేలకు…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో నాని ఏ6గా ఉన్నారు. ఈ ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బందరు మండలం పోట్లపాలెంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ…
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అక్రమ రవాణా కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సిట్ బృందంలో కొందరు సభ్యుల నియామకంపై వచ్చిన అభ్యంతరాలపై సిట్‌లో మార్పులు జరిగాయి. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్‌పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు..
నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.. కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్‌లో వెళ్లిన పవన్.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు.. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు.. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్…
రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే.. అవినీతి అధికారులకు కాసులు కురిపించే ముడిసరుకు. కాసేపు కళ్లు మూసుకుంటే చాలు.. చాలా మంది జేబులు నిండిపోతాయి. ఇది ప్రతి జిల్లాలో ఉండే బాగోతమే..! ఆ జిల్లాలో మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉందట అవినీతి అధికారుల తీరు. పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోకుండా డబ్బులతో మేనేజ్..? పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే PDS బియ్యాన్ని అక్రమ మార్గాల్లో మాఫియా తరలిస్తుందన్నది ఓపెన్ టాక్.…