NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌లో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గూగుల్ పే, పేటీఎం, రేజర్‌పేతో సహా పలు పేమెంట్ అగ్రిగేటర్‌లతో కలిసి పనిచేస్తోంది.
UPI LITE Payments: క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా?.. మన ఫోన్‌లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ అవతలి వ్యక్తికి చేరట్లేదా?.. ఇలాంటి సమస్యలకు ఇక కాలం చెల్లింది. వీటికి పరిష్కారంగా UPI LITE సర్వీస్ వచ్చేసింది. యూపీఐ లైట్‌తో చెల్లింపులు చేయటానికి పిన్ నంబర్ కూడా అవసరంలేదు. కాబట్టి.. పేమెంట్.. ఫాస్ట్‌గా.. ఈజీగా.. పూర్తవుతుంది. ఈ లావాదేవీల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం.
క్రమంగా పెరిగిపోయిన గ్యాస్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ చమురు ధరల ఎఫెక్ట్‌తో భారత్‌లో పెట్రో ధరలతో పాటు.. గ్యాస్ ధరలను కూడా వడ్డించాయి చమురు సంస్థలు.. ఇక, ప్రతీ నెల గ్యాస్ రేట్లను మార్పు కనిపిస్తూనే ఉంది.. అయితే, గ్యాస్ సిలిండ్ బుక్ చేసేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం.. సిలిండర్ బుకింగ్స్‌పై పలు రకాల ఆఫర్లను తీసుకొచ్చింది.. ఈ యాప్‌ను ఉపయోగించి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. క్యాష్…
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ…
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మొదట్లో ఎన్నో రాయితీలను, ఆఫర్లను తీసుకొచ్చిన ఆ ప్లాట్‌ఫారమ్‌లోని వివిధ సంస్థలు.. ఆ తర్వత వడ్డింపులు మొదలు పెట్టాయి.. మొబైల్ రీఛార్జ్‌తో పాటు ఇతర సేవలకు చార్జీలు వసూలు చేస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో పేటీఎం కూడా చేరింది.. తన ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్‌పై పన్నులు విధించడం మొదలుపెట్టింది. ఈ పన్ను ప్రస్తుతం రూ.1 నుండి రూ. 6 వరకు ఉంది. పన్ను మొత్తం రీఛార్జ్ ఖర్చులపై పూర్తిగా ఆధారపడి…
గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తర్వాత డిజిటల్ చెల్లింపులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు వెళ్ళి నగదు డ్రా చేయడం దాదాపు తగ్గిందనే చెప్పాలి. ఎక్కడ షాపింగ్ చేసినా, పాల ప్యాకెట్, పెట్రోల్, చాక్లెట్స్, మెడిసిన్స్… ఇలా ఏది కొనాలన్నా డిజిటల్ వ్యాలెట్ వాడేస్తున్నారు జనం. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే.. భారత్ పే.. ఇలా అనేకరకాల డిజిటల్ చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వినియోగదారులు మరో అనుభూతి…
ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్శేఖర్శర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. విషయం ఏంటంటే.. ర్యాష్డ్రైవింగ్కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.. అయితే, అదే రోజు బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు.. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి, అది దక్షిణ ఢిల్లీ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు.. కేసులో నమోదు చేసిన…
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాకుండా కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చే వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆన్‌బోర్డు చేయాలంటే ఆర్‌బీఐ ప్రత్యేక…
పేటీఎం కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ అయిన తొలిరోజే నిరాశపరిచింది. స్టాక్ ఎక్చేంజీలో పేటీఎం షేర్ల ధరను రూ.2150గా నిర్ణయించారు. అయితే, తొలిరోజు లిస్టింగ్ అయ్యే సమయానికి 9.30 శాతం తక్కువతో రూ.1950 ఇష్యూ ధరగా లిస్టింగ్ అయింది. ఆ తరువాత 11 గంటల వరకు 23 శాతం క్షీణించి షేర్లు రూ.1671.20 కి చేరింది. పేటీఎం షేర్లు క్షీణించినప్పటికీ కంపెనీ వ్యాల్యూ లక్షకోట్లకు మాత్రం తగ్గలేదు. Read: స్కూల్ ను మధ్యలో వదిలేశాడు… కోట్ల రూపాయలు…