గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తర్వాత డిజిటల్ చెల్లింపులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు వెళ్ళి నగదు డ్రా చేయడం దాదాపు తగ్గిందనే చెప్పాలి. ఎక్కడ షాపింగ్ చేసినా, పాల ప్యాకెట్, పెట్రోల్, చాక్లెట్స్, మెడిసిన్స్… ఇలా ఏది కొనాలన్నా డిజిటల్ వ్యాలెట్ వాడేస్తున్నారు జనం. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే.. భారత్ పే.. ఇలా అనేకరకాల డిజిటల్ చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వినియోగదారులు మరో అనుభూతి రానుంది.డిజిటలైజేషన్ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 40కి పైగా దేశాల్లో గూగుల్ వాలెట్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు గూగుల్ పేర్కొంది.
అదే Google Wallet.. ఈ యాప్ అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. గూగుల్ సంస్థ కొత్తగా అందుబాటులోకి రాబోతున్న గూగుల్ వాలెట్ యాప్ బహుళ ప్రయోజనాలను కలిగి వుంది. అందులో ప్రధానమైంది బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయడం. దీనితో వినియోగదారులు మరింత వేగంగా పేమెంట్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతిసారి తమ కార్డులు ఎక్కడ వున్నాయో వెతకడం, వాటి పిన్ నెంబర్లు గుర్తుంచుకోవడం కష్టం. అందుకే స్టోర్ అయిన సమాచారాన్ని ధృవీకరించి.. ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా తమ లావాదేవీలు ముగించవచ్చు అంటోంది గూగుల్.
వినియోగదారులు కార్డ్‌ని ప్రతిచోటా తీసుకెళ్లాల్సిన అవసరం లేనందున ఇంట్లో సురక్షితంగా ఉంచుకోవడానికి కూడా వీలును కల్పిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో డిజిటల్ ఐడిల కోసం యాప్‌కు మద్దతు లభించనుది. వినియోగదారులు తమ ఫ్లైట్ కోసం తమ బోర్డింగ్ పాస్‌ను ఈ యాప్‌లోనే స్టోర్ చేసుకోవచ్చు. దీని కారణంగా ఫ్లైట్ ఏదైనా ఆలస్యం లేదా రద్దు గురించి వినియోగదారులకు తెలియజేస్తుందని గూగుల్ చెబుతోంది. గూగుల్ వాలెట్ యాప్ ఇతర గూగుల్ సర్వీస్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది.
వ్యక్తుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ఢోకా వుండదని, ప్రైవేట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది అని కూడా కంపెనీ హామీ ఇస్తుంది. కంపెనీ యొక్క గూగుల్ పే ప్రస్తుతం వినియోగదారులను ఏవైనా లావాదేవీలు చేయడానికి, బిల్లులు లేదా ఏదైనా ఇతర ఖర్చులను చేయడానికి అనుమతిస్తుంది. త్వరలో అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్ వస్తే చెల్లింపులు మరింత సులభతరం అవుతాయంటున్నారు.
Vivo X80 : భారత విపణిలోకి వివో ఎక్స్80.. ఫీచర్స్ అదుర్స్..