పేటీఎం కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ అయిన తొలిరోజే నిరాశపరిచింది. స్టాక్ ఎక్చేంజీలో పేటీఎం షేర్ల ధరను రూ.2150గా నిర్ణయించారు. అయితే, తొలిరోజు లిస్టింగ్ అయ్యే సమయానికి 9.30 శాతం తక్కువతో రూ.1950 ఇష్యూ ధరగా లిస్టింగ్ అయింది. ఆ తరువాత 11 గంటల వరకు 23 శాతం క్షీణించి షేర్లు రూ.1671.20 కి చేరింది. పేటీఎం షేర్లు క్షీణించినప్పటికీ కంపెనీ వ్యాల్యూ లక్షకోట్లకు మాత్రం తగ్గలేదు.
Read: స్కూల్ ను మధ్యలో వదిలేశాడు… కోట్ల రూపాయలు సంపాదించాడు…
ఏ కంపెనీకైనా షేర్ల పతనం మామూలే. 18,500 కోట్ల ఐపీఓతో భారీగా సమీకరణలు చేపట్టిన పేటీఎం ఆసియాలోనే అత్యధిక ఐపీఓ సమీకరణలు చేపట్టిన కంపెనీగా రికార్డ్ సాధించింది. 2010 లో కోల్ ఇండియా కంపెనీ 15,200 కోట్ల ఐపీఓను సాధించింది. ఇక వన్ 92 కమ్యునికేషన్ కంపెనీని 2000లో ప్రారంభించారు. అప్పట్లో మొబైల్ టాప్అప్ కోసం వినియోగించేవారు. కాగా, 2009లో పేటీఎంను డిజిటల్ పేమెంట్లకు అనుగుణంగా మార్పులు చేయడంతో పూర్తిస్థాయిలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం పేటీఎంకు 333 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు అంటే ఆ కంపెనీ ఎంత భారీగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.