పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ మీటింగ్ లతో బిజీగా మారారు. సినిమాల పరంగా చుస్తే వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం క్రిష్, పవన్ లోని అన్ని కళలను బయటికి తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం పవన్ కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ సెట్ లో రిహార్సల్స్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై పవన్ పరమ భక్తుడు బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. నీకు తిరుగు లేదు దేవర అంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
” గన్ను పట్టిన పెన్ను పట్టిన కత్తిపట్టిన మైకు పెట్టినా ఏది పట్టిన ఎవరి పై గురి పెట్టిన మీకు తీరుగు లేదు దేవర” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. బండ్లన్న.. నీలాంటి అభిమానిని నేను చూడలేదు.. అని కొందరు అంటుంటే.. నిజమే అన్న అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడట. మరి ఈ పీరియాడికల్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
https://twitter.com/ganeshbandla/status/1511928588773126146?s=20&t=vJe22YL_2AKl74lBIHNX3w