జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో సమావేశం నిర్వహించారు.
Dadisetti Raja: ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన వేళ.. ఆస్కార్‌కు లింక్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి దాడిసెట్టి రాజా.. పవన్ కళ్యాణ్ అలియాస్ దత్త పుత్రుడు 3 నెలల విరామం తర్వాత హడావిడి చేస్తున్నారు.. ఏపీలో బీసీ రాజ్యాధికారం అంటే కాపులు, బీసీలు కలిసి చంద్రబాబు పల్లకి మోయటమా పవన్ ? అంటూ నిలదీశారు. చంద్రబాబుతో కొత్తగా కలిసి ఉన్నట్లు రెండు రోజులుగా…
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా టీడీపీ చంద్రబాబు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శించారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్న ఏమో బీసీ అంటున్నాడని, చిరంజీవి పార్టీ పెట్టి ఓటమి చెందిన తర్వాత రోజే అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కాపు, బీసీ ఓట్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. నిన్న బీసీ సదస్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే.. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేయగా.. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ సదస్సు నిర్వహించారు.. అయితే, ఆ సదస్సులో పాల్గొన్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల.. ఉన్నట్టుండి ఆమె జనసేన సమావేశానికి రావడం చర్చగా మారింది.. త్వరలోనే కాండ్రు కమల…