Minister Jogi Ramesh: పవన్, రజనీకాంత్‌పై జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీతో పెళ్లి, టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ ఫైర్ అయ్యారు.. మేం ఎవ్వరితో పొత్తులు పెట్టుకోం అని స్పష్టం చేశారు.. పవన్ కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ సవాల్ చేశారు.. సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలి అంటూ హాట్ కామెంట్లు చేశారు.. అమాయకులు పవన్ ని సీఎం అంటున్నారు.. కానీ, చంద్రబాబును పవన్ కల్యాణ్.. సీఎం అంటున్నాడన్న ఆయన.. టీడీపీకి పవన్ అమ్ముడుపోతాడు అని ఆరోపించారు.. అందరినీ చంద్రబాబుకి హోల్ సేల్‌గా అమ్మేస్తాడు అంటూ జనసేన శ్రేణులను హెచ్చరించిన ఆయన.. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలంటూ పిలుపునిచ్చారు.
Read Also: Kakani Govardhan Reddy: పంట నష్టంపై అంచనావేస్తున్నాం.. బురద జల్లొద్దు..
Also Read
- CJP: ‘‘అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల నుంచి షాక్..
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ఇక, చంద్రబాబు వేదిక మీద ఉండగా హాజరయ్యాడంటే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మానవత్వం లేదు అంటూ ఫైర్ అయ్యారు జోగి రమేష్.. రజనీకాంత్ కి సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. ఒక దొంగ చంద్రబాబు, ఇంకొక దొంగ రజనీకాంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. 14 ఏళ్లలో ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని చంద్రబాబుకు గుర్తు లేదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చంద్రబాబును చెంపమీద కొట్టాలన్న ఆయన.. ఎన్టీఆర్ ని పొట్టనపెట్టుకున్న చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు తరిమికొట్టాలంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఎన్టీఆర్ శతజయంతి వేదికగా చంద్రబాబుపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
CJP: ‘‘అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల నుంచి షాక్..
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!