Nadendla Manohar Interesting Comments On Chandrababu Pawan Kalyan Meeting: జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే తమ విధానం, నినాదమని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పారు. నిన్న చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ అదే కీలక అంశమని తెలిపారు. భవిష్యత్‌లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందన్నారు. సీట్లపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా & ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. తాను ఎక్కడ కాపురం పెడితే, అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. వైసీపీ వ్యతిరేకులంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి, దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
అంతకుముందు పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలోనూ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్న ఆయన.. ఈ ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపణలు చేశారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును.. మొదటి దశలో 41.15కు పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే.. ప్రాజెక్టు మరమత్తు కోసం రూ.2,030 కోట్ల పోలవరం అధారిటీ నుంచి సాంక్షన్ రాకపోయినా, జీవో విడుదల చేయడం అవినీతి కాదా? అంటూ నిలదీశారు. పోలవరం పూర్తైపోతుందని మభ్యపెట్టడాన్ని ఖండించాలన్నారు. లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే.. ప్రభుత్వం కేవలం 24 వేల కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి, చేతులు దులుపుకుందామని చూస్తోందని మండిపడ్డారు.
Kadapa Crime: ఇంటర్ ఫెయిలైన కూతురు.. అవమానంతో తల్లి ఏం చేసిందంటే?