సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్ కు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటని ఆయన అన్నారు. ఈడీ, సీఐడీ ఇన్కమ్ టాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.. వాటికి ముందు సమాధానం చెప్పు.. 118 కోట్లుకు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ పిలిస్తే తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ మంత్రి సెటైర్ వేశారు.
చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని నాదేండ్ల మనోహార్ అన్నారు.
జనసేన అధినతే పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు చేపట్టిన వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు.