Minister Jogi Ramesh: పవన్ కల్యాణ్ ఆరోపణలకు మంత్రి కౌంటర్.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: పెడనలో తనపై దాళ్ల దాడి జరిగే అవకాశం ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై సీరియస్‌గా కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెడనలో తన మీద రాళ్ల దాడి జరుగనుందని పవన్ కల్యాణ్ అభూత కల్పనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది పవన్ వైఖరిని దుయ్యబట్టారు. అవనిగడ్డలో పవన్ మీటింగ్ కు ముచ్చటగా 300 మంది వచ్చారు.. టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగిన మొదటి మీటింగ్ అది.. టీడీపీని మళ్లీ మోస్తాను అంటే ప్రజలు అంగీకరించ లేదన్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు చెప్పినట్లు టీడీపీకి ఓటు వేస్తే.. అదే లోకేష్ నిన్ను, నీ కుటుంబాన్ని నోటికి వచ్చినట్లు తిట్టారు.. ముఖ్యమంత్రి కావాలంటే మా బ్లడ్ ఎక్కించుకోవాలి అన్నారు.. ప్యాకేజీ రాగానే ఈ మాటలు పవన్ మర్చి పోయి ఉంటాడు.. కానీ, ప్రజలు మర్చిపోలేదు అని వ్యాఖ్యానించారు.
Read Also: KTR: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది.. మోడీకి కేటీఆర్ ఛాలెంజ్
Also Read
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
పెడనలో గొడవలు సృష్టించాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు జోగి రమేష్.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా.. నేనే స్వయంగా దగ్గర ఉండి పెడన నియోజకవర్గంలో నీ పర్యటన చేయిస్తా.. నీ సభ సక్సెస్ అయ్యేంత వరకు పక్కనే నిలబడతా.. దమ్ము ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. ఫలానా చోట నా మీద దాడికి కుట్ర జరుగుతోందని చూపించు.. పవన్ వ్యాఖ్యలు, ఆరోపణలు నిజం అయితే పోలీసులకు, డీజీపీకి వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ కుతంత్రాలు జరుగుతున్నాయన్న ఆయన.. జనసేన అభిమానులు ఇటువంటి మోసగాడిని నమ్మకండి అని సూచించారు. సింగిల్ గా పోటీకి రాలేని పిరికిపందలు.. గుంపులుగా, పందుల్లా వస్తాం అంటారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!