Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో పవన్ పేరు మారుమ్రోగిపోతుంది. ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ .. ఇప్పటివరకు జనసేన పార్టీతోనే ముందుకు కొనసాగుతున్నాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది.