ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము - కశ్మీర్ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని పోసాని ప్రశ్నించారు.
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
తూర్పు గోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ననే ఒన్స్ మోర్ అవుతారని మంత్రి పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ సీఎం జగన్ ప్రజల కోసం రెండు ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. వైఎస్సార్ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఆయన ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈరోజు వాసంతి నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు…
నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చంద్రబాబు చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ పోటీచేసిన స్థానాల్లో గెలిచి.. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వారిని గెలిపిస్తే సీఎం పోస్ట్ అడగవచ్చు అన్నారు.. ఇక, మేం టీడీపీ వెనకాల నడవడం లేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నాం అన్నారు.