OG : ‘ఓజి’ మూవీ కోసం మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు..రీసెంట్ గా బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి భారీ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌తో వస్తున్న ఓజీ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా సింగర్‌గా కూడా తానేంటో నిరూపించుకున్నారు.గతంలో అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా అనే పాట పాడి తన గాత్రం వినిపించారు. ఆ సినిమాలో ఆ పాటఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
అలాగే పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మరో సినిమా అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు వంటి పాటతో సింగర్‌గా పవన్ కల్యాణ్ ఎంతగానో అలరించాడు. తాజాగా మరోసారి తన పాటతో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడట పవన్ కల్యాణ్.ఓజీ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. “ఓజీ స్క్రిప్ట్‌లో పవన్ గారి చేత పాట పాడించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. మేం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం” అని తాజాగా సూపర్ సింగర్ సీజన్ 2కి గెస్టుగా వెళ్లిన తమన్ చెప్పుకొచ్చారు.అలాగే ఈ సినిమాకు తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఇచ్చారు . వాటిలో ఓ పాటను పుణెలో షూటింగ్ కూడా చేశారు.ఓజీలో పవన్ కల్యాణ్‌కు జోడీగా మలయాళ క్యూట్ భామ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది.. ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి సమర్పిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్, ప్రియాంకతోపాటు బాలీవుడ్ పాపులర్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఓజీలో సీరియల్ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Tags
- og movie
- pawan kalyan
- Sujith
- Thaman
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..