టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు.
పార్టీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు ఉంటాయని.. ఇది సహజమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీవీతో మంత్రి మాట్లాడారు. 175 గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. తాజాగా వచ్చిన సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేసిందన్నారు.
ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా బన్నీవాస్ను నియమించారు.. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాస్‌కు అందజేశారు జనసేనాని..
యువత, మహిళా బలం వల్లే వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొని జనసేన నిలబడగలుగుతోందని.. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే.. ఒక్కసారి జనసేనను నమ్మండి అంటూ పవన్ ప్రజలకు సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్.
ఇంఛార్జ్‌ల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయిందని.. ఒక ముఠాగా మారిందని విమర్శించారు.
రాష్ట్రంను హోల్ సేల్‌గా అమ్మేయడం వైసీపీ ప్రారంభించిందన్న జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. జనసేనలో పొలిటికల్ బ్రోకర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత అజ్ఞాత వాసి అయితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అజ్ఞాని అంటూ ఆగ్రహించారు.
సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెప్తున్నాయని ఎంపీ సురేష్ తెలిపారు. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?.. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్న విషయం తెలిసిందే… వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మరియు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు పవన్ కల్యాణ్ లైనప్ లో వున్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో పవన్ కల్యాణ్ రాజకీయ సమావేశాలతో బిజీగా మారిపోయాడు.…