Akira Nandan: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్. ఏఐ.. ఏ ముహూర్తన ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ ఫోటోలు చూస్తే ఒరిజినల్ ఫేస్ కూడా మర్చిపోయేలాగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా ఒక్కరిని కూడా వదలకుండా తమకు నచ్చినట్లు ఎడిట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్.. కొడుకు, కూతురుతో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
పవన్, రేణు దేశాయ్.. భార్యాభర్తలుగా విడిపోయినా కూడా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక వీరి ముద్దుల తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుర్రాడి టాలీవుడ్ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తండ్రి పోలికలను పుణికిపుచ్చుకున్న అకీరా.. ప్రస్తుతం తనకు నచ్చిన పని చేస్తున్నాడు. ఒక పక్క సంగీతం.. ఇంకోపక్క కత్తియుద్ధం లాంటివి నేర్చుకుంటున్నాడు. అయితే ఇప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని రేణు ఖరాకండీగా చెప్పుకొచ్చింది. మెగా ఫ్యామిలీకి రేణు దూరంగా ఉన్నా కూడా పిల్లలను దగ్గర చేస్తూనే ఉంటుంది. తాజాగా మెగా సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ వేడుకలకు అకీరా.. చెల్లి ఆద్యతో హాజరయ్యాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వేడుకకు పవన్ రాలేదు. దీంతో తండ్రి- పిల్లలను ఎడిట్ ద్వారా కలిపేశారు అభిమానులు. పవన్ కుర్చీలో కూర్చున్న ఫోటోకు అకీరా, ఆద్య నిలబడి ఉన్న ఫోటోను కలిపి ఫ్యామిలీ పిక్ గా మార్చేశారు. ఎడిట్ చేస్తే చేశారు కానీ.. ఏమన్నా ఉందా మావా పిక్ అంటూ అభిమానులు ఈ ఫోటోను వైరల్ గా మారుస్తున్నారు.