Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారంతో అభ్యర్థుల ప్రకటన కాస్త లేట్ అవుతుందని నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ఎవరు? ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేదానిపై అంతర్గతంగా కొంత క్లారిటీ ఉందని తెలుస్తోంది. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే చర్చ సాగుతూ వస్తుంది. కోస్తా నుంచి లేదా రాయలసీమ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీనిపై జనసేన నేత చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు.
Read Also: KA Paul: సీఎం జగన్, చంద్రబాబుకు కేఏ పాల్ సవాల్.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా..!
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనాని.. భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడినట్టు తెలిపారు.. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 20వ తేదీన ఆయన భీమవరం వెళ్లాల్సి ఉండగా.. 21వ తేదీ ఉదయం హెలికాప్టర్‌లో పవన్ కల్యాణ్.. భీమవరం వస్తారని తెలిపారు.. రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు పెరగడం మూలంగా పవన్ పర్యటన ఆలస్యం అవుతున్నట్టు పేర్కొన్నారు. భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.. టీడీపీ, జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం అవుతారని తెలిపారు. ఇక, పవన్ కల్యాణ్.. భీమవరం నుండి పోటీ చేస్తారు చెప్పుకొచ్చారు జనసేన జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..