జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
Pawan Kalyan Wish Ram Charan: ఈరోజు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో ఆయన 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా చరణ్-ఉపాసన దంపతులు ఈ రోజు ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చరణ్కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్ చెప్పారు. రానున్న రోజుల్లో చరణ్ మరింత విజయాలు…
ఈ నెల 30వ తేదీ నుంచి జనంలోకి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్... తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మూడు రోజులు మకాం వేయనున్నారు. 30 నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కల్యాణ్ పర్యటన సాగనుంది. 30న నియోజకవర్గ నేతలతో సమీక్ష ఉంటుంది.
నాపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమే తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నుంచి మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. 2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బులు వసూలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,…
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం మరోసారి భారీ విరాళాన్ని అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన పొన్నూరు నియోజకవర్గంలో రోడ్ షో, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 1983లో ఒక బలమైన భావజాలంతో పుట్టిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆశయంతో పుట్టిందని చెప్పారు. అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కల్యాణ్…
పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడమే న్యాయం అన్నారు పోతిన మహేష్.. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారన్న ఆయన.. పశ్చిమ నియోజకవర్గంలో కొండా ప్రాంతల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడిందన్నారు.