సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు.
ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఎన్డీఏ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ దిశానిర్ధేశం చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచనలు చేశారు.
Vanga Geetha on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురంను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ మాట్లాడవద్దన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి 25 ఏళ్లుగా తానేం చేశానో ప్రజలకు తెలుసని వంగా గీత పేర్కొన్నారు. 2024 శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వంగా గీతలు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు…
పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏ నిర్ణయం తీసుకున్నారంటే..! జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆమె… సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ, కేజ్రీవాల్ జైలు కెళ్లిన పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో…
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పిఠాపురంలో పవన్ వారాహి సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శక్తి పీఠంలో వారాహికి పూజ వాయిదా పడింది.