Naga Mahesh about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన పార్టీని 2014లోనే ఆయన స్థాపించినా సరే 2024లో 21 స్థానాలను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆయన గురించి తాజాగా నటుడు నాగ మహేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ గ్యాప్ లో ఫోను మాట్లాడుతూ నడుస్తూ వెళ్లారట. అక్కడ ఒక టెంట్లోకి వెళితే ప్రొడక్షన్…
రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అని జనసేన చీఫ్ పవన్ పేర్కొన్నారు. కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. గతంలో అలా చేశారు కాబట్టి.. మనమూ అలాగే చేయాలని అనుకోవద్దు.. కక్ష సాధింపును నేను ఎంకరేజ్ చేయను అంటూ తెలిపారు. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా అవతరించాం.. దేశంలో ఎవ్వరికి లేని రికార్డు 100 శాతం స్ట్రైకింగ్ రేట్ మనకు వచ్చింది.
ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు.
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
Vijay Sethupathi Shocking Comments on Pawan kalyan: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీరంగానికి చెందినవారు ఈ విషయం మీద మాట్లాడగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం పవన్ కళ్యాణ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ అనే సినిమాఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్లో…