Kalki 2898 AD Event Cancelled at Amaravathi: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్, దిశాపటాని, దీపికా పదుకొనే వంటి స్టార్లు నటించడంతో పాటు టీజర్, ట్రైలర్ కట్స్ సినిమా మీద అంచనాలను పెంచాయి. నిజానికి ట్రైలర్ మీద మిశ్రమ స్పందన ఉన్నా ప్రస్తుతానికి ఆ సినిమా మీద బజ్ అయితే గట్టిగానే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ అమరావతిలో ప్లాన్ చేస్తున్నారని, జూన్ 23వ తేదీన జరగబోయే ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ప్రచారం జరిగింది. ఈ విధంగా అమరావతిలో జరిగే మొట్టమొదటి సినిమా ఈవెంట్గా కల్కి నిలిచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు చాలా కాలం తర్వాత పవన్, ప్రభాస్ కూడా ఒకే స్టేజి మీద కలిసి కనిపించబోతున్నారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల అభిమానులకు షాక్ కలిగించే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే అమరావతిలో ఈవెంట్ చేయడం లేదని తెలుస్తోంది.
Actor Darshan: ఒక మేనేజర్ మిస్సింగ్.. మరో మేనేజర్ ఆత్మహత్య.. మరిన్ని చిక్కుల్లో దర్శన్?
ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే చేస్తున్నారని, పార్క్ హయత్ లేదా ఐటీసీ కోహినూర్ హోటల్స్ లో ఈవెంట్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈవెంట్ చేయకపోవడానికి కారణం వర్షాభావ పరిస్థితులనే చెబుతున్నారు. దానికి తోడు ప్రభాస్ కూడా అక్కడ వరకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి హైదరాబాద్లో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే వారు వస్తారా రారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. భారీ అంచనాలతో ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ సేల్ విషయంలో కొన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినీ రికార్డులను బద్దలు కొడుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ఆయన భార్య ప్రియాంక, మరదలు స్వప్న తమ తండ్రి అశ్వినీ దత్ తో కలిసి వైజయంతి బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.