Pawan Kalyan: నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..
- నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని
- డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కు పంచాయతీరాజ్.. గ్రామీణ నీటి సరఫరా.. పర్యావరణం.. అడవులు.. సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు
- ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌ను మంగళవారం రోజే పరిశీలించారు పవన్.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న జనసేనానికి అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గంటన్నరపాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు..
Read Also: Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
Also Read
మరోవైపు.. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కల్యాణ్‌కు కేటాయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా.. పవన్ కల్యాణ్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.. ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఆ తర్వాత ఉదయం 11.30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో చర్చించనున్నారు.. అనంతరం మధ్యాహ్నం 12.30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు పవన్ కల్యాణ్. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 164 స్థానాలు వస్తే.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!