ఏపీలో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూటమి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. తొలిసారి తన ఛాంబరుకు వచ్చిన పవన్ కల్యాణ్ని సీటులోంటి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు..ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి.. మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. తాజా రాజకీయాలు, అసెంబ్లీ సమావేశాలుపై చంద్రబాబు-పవన్ మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు పోలవరం పర్యటన, ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై చర్చ జరిపారు. సచివాలయం చేరుకున్న అనంతరం నేరుగా సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
READ MORE: Nara Lokesh: “2019లో ఈవీఎంలు గొప్పగా పని చేస్తే గెలిచి, ఓడిపోయినప్పుడు నిందిస్తారా?”
కాగా.. ఎన్నికల ఫలితాలు విడుదలై డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ తొలిసారి జూన్ 18న ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 2017 తర్వాత పవన్ సచివాలయానికి రెండవసారి వెళ్లారు. నాడు ఉద్దానం సమస్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లారు. రాష్ట్ర సచివాలయంలోని బ్లాక్-2లో తనకు కేటాయించిన ఛాంబర్‌ని పవన్ పరిశీలించారు. రేపు పంచాయతీరాజ్, గ్రామీణ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అంతకంటే ముందు పవన్ కల్యాణ్‌కు Y ప్లేస్ కేటగిరి, ఎస్కార్ట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అలాగే బులెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించింది.