ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
Pawan Kalyan Takes Oath As AP Minister: మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల నిజమైంది. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. 2014వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం మద్దతు తెలిపి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే 2019వ సంవత్సరంలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం రెండిటికి దూరమై ఒంటరిగా పోటీ చేసి 175…
పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
చంద్రబాబు నేతృత్వంలో నేడు ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Naga Mahesh about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన పార్టీని 2014లోనే ఆయన స్థాపించినా సరే 2024లో 21 స్థానాలను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆయన గురించి తాజాగా నటుడు నాగ మహేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ గ్యాప్ లో ఫోను మాట్లాడుతూ నడుస్తూ వెళ్లారట. అక్కడ ఒక టెంట్‌లోకి వెళితే ప్రొడక్షన్…
రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అని జనసేన చీఫ్ పవన్ పేర్కొన్నారు. కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. గతంలో అలా చేశారు కాబట్టి.. మనమూ అలాగే చేయాలని అనుకోవద్దు.. కక్ష సాధింపును నేను ఎంకరేజ్ చేయను అంటూ తెలిపారు. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా అవతరించాం.. దేశంలో ఎవ్వరికి లేని రికార్డు 100 శాతం స్ట్రైకింగ్ రేట్ మనకు వచ్చింది.
ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు.