Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాపై పోస్ట్.. అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!
- ఆగిపోయిందనే రూమర్స్
- అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
- రూమర్స్ చదివే సమయం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Harish Shankar Reply To Fan about Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్‌ను గబ్బర్ సింగ్ నిలబెట్టింది. అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటికి డైరెక్టర్ హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఆగిపోనుందంటూ ఎక్స్‌లో ఒకరు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ వరకు చేరింది. సదరు వ్యక్తికి హరీశ్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ‘సినిమా మొదలే కాదు అని రూమర్స్ వచ్చినప్పుడే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి రూమర్స్ గురించి చదివే సమయం నాకు లేదు’ అని హరీశ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ స్పష్టం చేశారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన మహిళా ఫ్యాన్.. కారణం ఏంటంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీశ్ శంకర్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. సమయం దొరికినప్పుడు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సహా ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు పవన్ పూర్తి చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!