Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
- పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపిస్తాం..
- రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలకు కూడా బకాయిలు పెట్టేశారు..
- రైతుల బకాయిలు తీర్చడానికి రూ.1000 కోట్లు సీఎం మంజూరు చేశారు..
- ద్వారంపూడి కుటుంబం అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది..
- ఇంకా తనిఖీలు చేస్తాం.. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ఐదేళ్ల పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతో ఇబ్బందులు ఎదుర్కొని చితికిపోయారు.. రైతు భుక్తే ప్రమాదంలోకి నెట్టేశారు.. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలకు కూడా బకాయిలు పెట్టేశారు.. 36,300 కోట్ల రూపాయల అప్పుల పాలు చేశారు… 1659 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెట్టారని మండిపడ్డారు.. అయితే, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి బాధ్యత మాది.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రైతుల అంశంపై సానుకూలంగా స్పందించారు.. రైతుల బకాయిలు తీర్చడానికి 1000 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు మంజూరు చేశారని వెల్లడించారు.
Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇక, ఆహార భద్రత కూడా మా బాధ్యత.. బియ్యం, నిత్యవసర సరుకులు తూకంలో తేడా వచ్చినా, పక్కదారి పట్టించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని ఆరోపించిన ఆయన.. ఇంకా తనిఖీలు చేస్తాం.. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.. కచ్చితంగా స్ధానిక కలెక్టర్ తో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం.. రైతుల పొట్ట కొట్టిన వారి పై చర్యలుంటాయి.. సక్రమ పంపిణీ జరపడం జిల్లా యంత్రాంగం బాధ్యత.. పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు. అయితే, కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా మార్చారు.. 35404 మెట్రిక్ టన్నులు 159 కోట్ల విలువ కలిగిన సరుకు సీజ్ చేశాం.. కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్ల తనిఖీలో మాత్రమే 35404 మెట్రిక్ టన్నులు వచ్చింది.. ఒక కిలో బియ్యం 39 రూపాయలకు ఇస్తోంది… 1000 కోట్లను జిల్లాలకు చెల్లించిన విధానం.. పశ్చిమ గోదావరి కి 565.95 కోట్లు, తూర్పు గోదావరికి 121.96 కోట్లు, కోనసీమ కి 163.59 కోట్లు, కాకినాడ కు 21.92 కోట్లు, ఏలూరు కి 119 కోట్లు, బాపట్ల కు 6.65 కోట్లుగా ఉందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!