Harish Shankar on Ustaad Bhagat Singh: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఒకరు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై హరీశ్ తన అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా మరోసారి పవన్‌పై అభిమానం చూపారు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఆయనకు ఫ్యాన్‌గానే ఉంటాడు అని చెప్పారు. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయడం గర్వంగా ఉందని హరీశ్…
విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
కలెక్టర్ట కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు.
భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఒకేసారి ఐదు లక్షలు.. పది లక్షల చెట్లు నాటేలా వన మహోత్సవాలను కార్యక్రమం చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు.
పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వినతులు ఎన్ని ఉన్నా... అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాయన.. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు..
Committee Kurrollu Konidela Niharika: మెగా ఫ్యామిలీ కూతుర్లలో ఒకరైన నిహారిక కొణిదెల, భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిన తర్వాత కెరీర్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ తన సత్తా చాటుతోంది. నిహారిక తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ లు ప్రధాన పాత్రలు పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ…
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు అని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు.