Prakash Raj Counter to Pawan Kalyan over Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్న ఆయన స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందని తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ శుక్రవారం కోరారు. తిరుమలలో కొనసాగుతున్న లడ్డూ వివాదంపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పవన్ ఈ విషయం దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతుల చుట్టూ ఉన్న అనేక సమస్యలను సూచిస్తుందన్నారు. చాలా ప్రశ్నలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చారు.
Mirnalini Ravi: ఓ ఇంటిదైన వరుణ్ తేజ్ హీరోయిన్
సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని కోరిన ఆయన లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదు అందాయని.. ల్యాబ్ పరీక్షలు చేయించాలని చాలా మంది ఫిర్యాదు చేశారన్నారు. ఇక X లో పవన్ కళ్యణ్ లడ్డు ఇష్యూ పై పెట్టిన ట్వీట్ ను కోట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన పోస్ట్ పెట్టారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు…మీరు DCM గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి విచారించండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. (కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ లో ప్రకాష్ రాజ్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.