మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారాన్ని దించాలంటే కాంగ్రెస్కు చురకలు పెట్టాల్సిందేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మేడలు వంచుతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా, గెలిచినా.. ప్రభుత్వం పడిపోదని తెలిపారు. అహంకారం మత్తులో ఉన్న కాంగ్రెస్ ను ఓడించాలని దుయ్యబట్టారు. రైతుబంధు, ఆరు గ్యారెంటీలు అన్ని తుపాకీ మాటలేనని ఆరోపించారు. మీ మోసాలకు గుణపాఠాలు…