Patanjali: ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన ‘పతంజలి’ తప్పుడు ప్రకటనలో కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద్ ‘తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనల’ కేసులో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రకటనల ద్వారా దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Baba Ramdev : ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న యోగా గురు రామ్‌దేవ్‌కు శుభవార్త అందింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రోల్టా ఇండియా లిమిటెడ్‌కు రీ-బిడ్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్ అనుమతి ఇచ్చింది.
Today Stock Market Roundup 16-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం తీవ్ర ఊగిసలాటకి గురైంది. ఈ వారంలో మొదటి 3 రోజులు లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఎట్టకేలకు వరుసగా ఐదు రోజుల నుంచి వస్తున్న నష్టాలకు బ్రేక్ పడింది. ఎఫ్‌ఎంసీజీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలోని కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణించాయి.
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్.. హరిద్వార్‌లో పతంజలి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారని.. అమెరికాను టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రపంచానికే మేము చక్రవర్తులం అంటూ.. మాకంటే గొప్పవారెవరూ లేరు…
ఒమిక్రాన్ వేరియంట్ వంటి కరోనా వైరస్‌లతో పాటు పలు రకాల ఫంగస్‌లు కూడా ప్రజలకు సోకుతున్నాయి. కాగా బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) చికిత్స కోసం పతంజలి ఆయుర్వేద మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘అనూ తైల’ పేరుతో ముక్కు ద్వారా ఈ మందును ఇస్తారని పతంజలి సంస్థ వెల్లడించింది. అధునాతన సాంకేతిక పద్ధతులతో పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘అనూ తైల’ మందును కనుగొందని వివరించింది. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా…