అనుమానస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందటానికి ముందు బెజవాడలో ఉన్న 3 గంటలు ఏం చేశారనే దానిపై మిస్టరీ వీడింది. ఈ నెల 24న ప్రవీణ్ బెజవాడ మీదుగా రాజమండ్రి వెళ్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో బెజవాడ నగరంలో ఉన్న 200 సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు ప్రవీణ్.. విజయవాడ నగరంలో ఏం చేశాడనే విషయాన్ని గుర్తించి నివేదికను పోలీస్ కమిషనర్ (సీపీ)కి అందజేశారు పోలీసులు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.