డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు ఇవాళ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో వైరాకు వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. అయితే, వెంకటేశ్వర్లు ఆయుర్వేద డాక్టరుగా పని చేశారు.. ఇక, తన సోదరుడు వెంకటేశ్వర్లు మరణ వార్త తెలియగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి వైరాకు బయలుదేరి వెళ్లారు.. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఈలోగా సోదరుడు వెంకటేశ్వర్లు మరణించడంతో.. స్వగ్రామానికి బయల్దేరనున్నారు. ఇక, ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో వెంకటేశ్వర్లు అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.