Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్(75) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు.. సమస్య ఎక్కువ కావడంతో వైద్యానికి సహకరించలేదు.. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.. ఈయన 1948లో బీహార్‌లోని అరారియాలో ఆయన జన్మించారు, సహారా ఇండియా పరివార్‌ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం రూ. 2,000 తో వ్యాపారాన్ని ప్రారంభించి,సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సయమంలో ఒక రిపోర్టులో భారతీయ రైల్వే తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి సంస్థగా అభివర్ణించారు.
ఈయన మెటాస్టాటిక్ ప్రాణాంతకత, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో సుదీర్ఘ పోరాటంలో కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో సుబ్రతా రాయ్ మరణించారని సహారా బుధవారం ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి చికిత్స ను పొందుతూన్నారు.. ఆరోగ్యం విష మించడంతో తుది శ్వాస విడిచారు..
Also Read
ఇక సహార ఇండియా కూడా ఐపీఎల్ పుణే వారియర్స్ ఇండియా పేరుతో ఒక జట్టును కొనుగోలు చేసింది. తర్వాత బీసీసీఐ తో విభేదాల కారణంగా ఈ ప్రాంచైజీని రద్దుచేసుకుంది.. ఇదొక్కటే కాదు.. గ్రో స్వెనర్ హౌజ్ ఎంబీ వ్యాలీసిటీ ప్లాజా హోటల్, డ్రీమ్ డౌన్ టౌన్ హోటల్స్ కు యజమాని. సుబ్రతారాయ్ మరణం పట్ల సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ ద్వారా సంతాపం ప్రకటించింది. సహరాశ్రీ సుబ్రతారాయ్ జీ మరణం భాధాకరం.. ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు…
VIDEO | Visuals from outside Mumbai’s Kokilaben Dhirubhai Ambani Hospital & Medical Research Institute.
Sahara Group chief Subrata Roy died due to a cardiorespiratory arrest on Tuesday after a prolonged illness. According to the company statement, he was admitted to the… pic.twitter.com/AfXxq3jEb9
— Press Trust of India (@PTI_News) November 14, 2023
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!