ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పథకాల అమలు, పేర్లు కొనసాగింపునకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది. గత సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను మార్చింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.