Budget Session : రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిల పక్ష భేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget Session : భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడో సారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి.
Read Also:Gas Cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్.. మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
నేడు అఖిలపక్ష సమావేశం
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం నేడు (జనవరి 30) ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, లోక్‌సభ డిప్యూటీ లీడర్, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, రాజ్యసభ లీడర్, ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురుగన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు, చర్చించాల్సిన అంశాలు పై తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.
Read Also:GHMC: నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ!
ప్రధాన చర్చాంశాలు
కేంద్ర బడ్జెట్ ప్రణాళిక, పార్లమెంటులో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు సమయం కేటాయింపు, రైతు సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక విధానాలపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే రంగాలు, ముఖ్య ప్రణాళికలు, ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు, ప్రతిపక్షాలు ఆర్థిక వ్యూహాలు, నిరుద్యోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరమని ప్రభుత్వం కోరనుంది. ఉభయసభల్లోని పలు పక్షాల నేతలు అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాలపై ప్రభుత్వం తరఫున మంత్రులు రాజనాధ్ సింగ్, జెపి నడ్డా సమాధానం ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!