1993లో విడుదలైన జపనీస్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనను ఫిబ్రవరి 15న పార్లమెంట్‌లో నిర్వహిస్తున్నట్లు చిత్ర పంపిణీ సంస్థ గీక్ పిక్చర్స్ ఆదివారం తెలియజేసింది. జపాన్-ఇండియన్ యానిమేషన్ చిత్రం ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటు సభ్యులు, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు. గీక్ పిక్చర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ చిత్రం ప్రదర్శన కేవలం సినిమా ప్రదర్శన మాత్రమే కాదు, ఇది మన దేశ గొప్ప వారసత్వానికి సంబంధించినది, రామాయణ కథ శతాబ్దాలుగా మనకు స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా ఉంది అన్నారు.
Udit Narayan: లేడీ ఫ్యాన్ కి లిప్ కిస్.. ఉదిత్ నారాయణ్ షాకింగ్ రియాక్షన్
ఈ యానిమేషన్ సినిమాకి ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పేరుగాంచిన రచయిత V విజయేంద్ర ప్రసాద్ కొత్త వెర్షన్ క్రియేటివ్ టీంలో పనిచేశారు. ఇక ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ 1993లో 24వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI)లో భారతదేశంలో ప్రదర్శించబడింది, కానీ థియేటర్లలో విడుదల కాలేదు. 2000ల ప్రారంభంలో TV ఛానెల్‌లలో ప్రసారం అయిన తర్వాత దీనికి భారతీయ ప్రేక్షకులలో ప్రజాదరణ ఏర్పడింది. ఇక ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ జనవరి 24న భారతదేశంలో విడుదలైంది, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లోకి డబ్ చేయబడింది. రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ చిత్రానికి యుగో సైకో, రామ్ మోహన్ అలాగే కోయిచి ససాకి దర్శకత్వం వహించారు.