పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష భేటీలో టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు సూచించారు. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు కోరినట్టు తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించలేదని చెప్పామన్నారు. దీనిపై ఏకీకృత నిబంధనలు తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని…
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రం పై ఒత్తిడితీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కృష్ణ జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై…
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢీల్లీల్లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు ద్రవ్యోల్బణం, చమురు ధరల పెంపు, చైనా వివాదం, కాశ్మీర్ అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్నిప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని పట్టు పట్టనుంది. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నట్టు కాంగ్రెస్ నేత మల్లిఖార్జన ఖర్గే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రి మండలిలో 77 మంది ఉన్నారు. ఈ 77 మంది మంత్రులను 8 గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్లోనూ కొంతమంది నైపుణ్యం ఉన్న యువకులను, రిటైర్డ్ అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సలహాలు తీసుకుని మెరుగైనా విధానాలను రూపొందించి అమలు చేయనున్నారు. మం త్రుల పారదర్శకతను పెంపొందించేందుకు ఈ నిపుణుల బృందం పనిచేస్తుందని తెలిపారు. మంత్రి మండలిని మొత్తం 8 గ్రూపులుగా విభజించే ప్రక్రియ…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహదుల్లో సుదీర్ఘంగా తమ పోరాటానికి కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు.. కొత్త కొత్త తరహాలో ఎప్పటికప్పుడూ తమ నిరసనలను తెలియజేస్తూ వస్తున్నారు.. ఇక, ఢిల్లీలో మరోసారి భారీ ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం అవుతున్నారు.. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలు పతాకస్ధాయికి చేరాయి. రైతుల నిరసనలు చేపట్టి ఏడాది పూర్తవడంతో ఆందోళనలను ముమ్మరం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు.. ఈ నెల 26న 500…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సమయం అసన్నమైంది… సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక, ఈ సెషన్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2013 సవరణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 సవరణ బిల్లు ఈ…
రాజ్యసభ సమావేశాలకు ఎంతమంది హాజరయ్యారు అనే దానిపై రాజ్యసభ సచివాలయం గణాంకాలను తయారు చేసింది. అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఏడు రాస్యసభ సమావేశాలకు 78 శాతం మంది ఎంపీలు రోజూ హాజరవుతున్నట్టుగా గుర్తించారు. అందులో 30శాతం మంది క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 2019 నుంచి 2021 వరకు మొత్తం ఏడు రాజ్యసభ సమావేశాలు జరిగాయి. రాజ్యసభలో 225 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా రాజ్యసభకు హాజరైనపుడు తప్పనిసరిగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. 248 వ సమావేశం…