అమెరికా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని ప్రధాని సందర్శించడంతో ఇంజనీర్లు షాకయ్యారు. దాదాపు గంటసేపు ప్రధాని మోడీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలు కొత్త…
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వీటితో పాటు బీహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.వాయిస్..ఈ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ కు సెప్టెంబర్ 22 తుది…
ఆఫ్ఘనిస్థాన్ క్రమంగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు.. అధ్యక్ష భవనాన్ని సైతం స్శాదీనం చేసుకున్నారు.. ఇక, క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్‌లో భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని సాయుధ తాలిబన్లు ఇవాళ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్ చైర్లో ఒక తాలిబన్ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉండగా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు తాలిబన్లు కూర్చున్నారు.. కాగా, మొన్నటి…
తీర్పుల సందర్భంగా.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇప్పుడు ఆయన.. ఈ మధ్యనే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుపై స్పందిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఒకప్పుడు సభలో మొత్తం లాయర్లే ఉన్న సమయంలో పార్లమెంట్ ఎంతో హుందాగా నడిచేదంటూ ఆసక్తికర…
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయంతే. ఏ కార్యక్రమం సరిగా సాగదు. ప్రశ్నలు లేవు.. సమాధానాలు లేవు. ఇక చర్చల ప్రసక్తే లేదు.. నినాదాలు ..ఇకటే రణగొణ ధ్వనులు . గత రెండు వారాలుగా పార్లమెంట్ లో ఇవి తప్ప మరొకటి ఉందా. ఇదీ మనం చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు. పంతం నెగ్గించుకోవటానికి ప్రతిపక్ష సభ్యులు దేనికైనా సిద్ధమంటున్నారు. కాగితాలు చింపుతారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్తారు. చైర్మన్ సీట్‌పైకి ఫైల్స్ విసిరేస్తారు.. టేబుల్…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి… ఓవైపు పెగాసస్ వ్యవహారం.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. ఇలా రకరాల సమస్యలపై నిత్యం పార్లమెంట్ ఉభయసభల్లో ఏదో ఒక రచ్చ జరుగుతూనే వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. లోక్‌సభను ఇవాళే నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.. ఇక, ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 21.14 గంటలు మాత్రమే పనిచేసింది… విపక్షాల నిరసనల కారణంగా ఏకంగా…
లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పెద్దల సభగా పెరుపొందిన రాజ్యసభలోనూ సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు నిరసనలు తెలియజేశాయి. ఎంపీలు నిలబడి, బల్లలపైకి ఎక్కి పెద్దగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక దేవాలయం వంటిదని, కొందరు ఎంపీలు అమర్యాదగా ప్రవర్తించారని, పోడియం ఎక్కి నిరసనలు చేయడం అంటే, గర్భగుడిలో నిరసనలు చేయడమే అని రాజ్యసభ…
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రసాభాసాగా సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నూతన వ్యవసాయ చట్టాలు, పెగాసస్ అంశంపై చర్చకు పట్టుబడుతూ వచ్చాయి విపక్షాలు. నినాదాలు, నిరసనల మధ్య సభను నిర్వహించారు. అయితే, ఈరోజు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి…