విద్యుత్ సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ కమిటీలు ఈ మేరకు తీర్మనాం చేశాయి. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. డిసెంబర్ 8న ప్రధాన మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో పాటు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాల అందజేయనున్నట్టు వారు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు మద్దతు…
పార్లమెంట్ సమావేశాల్లో పోరుబాట పట్టిన టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీలతో కలిసి ధర్నాలలో పాల్గొనడం దేనికి సంకేతం? జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయబోతోంది? పార్లమెంట్ లోపల.. బయట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ.. ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తుందా? జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్రేంటి? తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నది అధికార టీఆర్ఎస్ ఆరోపణ. రైతులకు మేలు కలిగేలా కేంద్రం సానుకూల ప్రకటన…
పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు మేలు కోసమే చట్టాలు తీసుకొచ్చామని, రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాలను వెనక్కి తీసుకున్నాక, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసిన సమయంలో 750 మంది మృతి చెందారు. వీరందరికీ కేంద్రం పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. Read: ఒమిక్రాన్ కొత్త రూల్స్: ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంటలు… దీనిపై ఈరోజు కేంద్ర…
వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,…
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి…
సామాన్యుడి నడ్డి విరిచేలా.. ప్రతీ వస్తువుపై ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో భారం పడేలా పెట్రో ధరలు వరుసగా పెరిగిపోయాయి.. అయితే, దీపావళికి ముందు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం.. ఆ తర్వాత క్రమంగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలి రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.. అంతే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా తగ్గించాల్సిందేనంటూ ఒత్తిడి పెరిగుతోంది.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. అయితే,…
12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన రాజ్యసభ ఛైర్మన్.. శీతాకాల సమావేశాల నుంచి కూడా మొత్తంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఎంపీలు ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, డోలా…
ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత సైన్యం 577 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నవంబర్ 25, 2021 నాటికి అర్హత కలిగిన 63 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సందర్భంగా దీనిపై ఆయన వివరణ…
శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో క్రిప్టో, డిజిటల్ కరెన్సీపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని నిర్ణయిస్తూనే, డిజిటల్ కరెన్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 చట్టంలో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈరోజు సభ ప్రారంభమయ్యాక డిజిటల్ కరెన్సీపై ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి. Read: ఒమిక్రాన్…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వానికి తెరలేపింది.. మరోవైపు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. వ్యసాయ చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. ఆ బిల్లులను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. ఇవాళ వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం జరిగిపోయాయి.. ఇక, లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు ఆమోదంపై స్పందించారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… లోక్‌సభ ఆమోదించిన…